కేసీఆర్ కు లక్ష్మణుడిలా, కేటీఆర్ కు హన్మంతుడిలా ఉంటా

వరంగల్ అర్బన్: రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్… తనకు చీఫ్ విప్ పదవి ఇచ్చినందుకు సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ రోజు ఆయన వరంగల్ లో మీడియాతో మాట్లాడుతూ.. ఉద్యమకారుడిగా.. పార్టీ విధేయుడిగా గుర్తించి ఈ అవకాశం ఇచ్చినందుకు సీఎం కేసీఆర్, టిఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు.

సీఎం కేసీఆర్ అప్పగించిన బాధ్యతను క్రమశిక్షణతో నెరవేరుస్తానని, తనకు ఈ పదవి ఇచ్చిన సీఎంకు రుణపడి ఉంటానన్నారు వినయ్ భాస్కర్. కేసీఆర్ కు లక్ష్మణుడిలా, రామన్న(కేటీఆర్)కు హన్మంతుడిలా ఇకముందు పార్టీకి సేవాలందిస్తానని, కార్యకర్తలను కంటికి రెప్పలా కపడుకుంటానని తెలిపారు

తన కుటుంబం తెలంగాణ కోసం పోరాటం చేసిన కుటుంబమని, టీఆరెస్ పార్టీ ప్రస్థానం నుంచి టీఆరెస్ లో కొనసాగుతున్నట్లు వినయ్ భాస్కర్ తెలిపారు. కార్పొరేటర్ స్థాయి నుండి ఇక్కడ వరకు వచ్చానని, నియోజకవర్గ అభివృద్ధికి అనేక కార్యక్రమాలు చేస్తున్నానని ఆయన అన్నారు. దసరా రోజున టీఆరెఎస్ పార్టీ   కార్యాలయాన్ని కేటీఆర్ తో కలిసి ప్రారంభించడానికి సిద్దం చేస్తున్నానని చీఫ్ విప్ వినయ్ భాస్కర్ అన్నారు.

Cheif whip Dasyam Vinay Bhaskar comments at Warangal Dist

Latest Updates