భార్యా, పిల్లలను చంపి తాను ఆత్మహత్య చేసుకున్న ఇంజనీర్

chemical-engineering-kills-his-family-self-in-gurgaon-delhi

చిన్న చిన్న కారణాలకే ప్రాణాలు విడుస్తున్నారు కొంతమంది.. ఇలాంటి ఘటనే ఢిల్లీలోని గుర్గావ్ లో జరిగింది. అయితే… ప్రకాశ్ సింగ్ అనే ఓ కెమికల్ ఇంజనీర్ తన భార్యా, పిల్లలను చంపి తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఆదివారం రాత్రి జరిగింది. సోమవారం పొద్దున ఎవరూ ఇంట్లో నుంచి బయటకు రాకపోయేసరికి పక్క అపార్ట్ మెంట్ వాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు తలుపులను పగులకొట్టి లోపలికి వెళ్లి చూడగా నలుగురి మృతదేహాలు కనిపించాయి.

ప్రాణం లేకుండా పడి ఉన్నమృతదేహాలను… ప్రకాష్ సింగ్(55), అతని భార్య, కుమార్తె (22),కుమారుడు(13)గా గుర్తించారు. ఘటనా స్థలం వద్ద ఒక లెటర్ ను కనుగొన్నారు పోలీసులు. అందులో తాను తన కుటుంబాన్ని సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోతున్నాను అని ప్రకాశ్ సింగ్ రాసినట్టుగా ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ఆ లెటర్ రాసింది ప్రకాశేనా… మరేవరైనా రాశారా అని తెలుసుకుంటున్నామని పోలీసులు తెలిపారు. ప్రకాశ్ కుటుంబం ఆర్థికంగా బాగా ఉన్నప్పటికీ .. మరేవిషయంలో ప్రాణాలు కోల్పోవలసి వచ్చిందో తెలియాల్సివుందని పోలీసులు చెప్పారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

Latest Updates