చూపు లేకున్నా కెమిస్ట్రీ నేర్చుకోవచ్చు

  • కొత్త బ్రెయిలీ లిపిని డెవలప్‌‌ చేసిన జేఎన్‌‌యూ ప్రొఫెసర్‌‌

చూపులేని స్టూడెంట్స్‌‌ కూడా ఇకపై ఈజీగా కెమిస్ట్రీ నేర్చుకోవచ్చు. ఇప్పటివరకు ఉన్న బ్రెయిలీ లిపి మోడల్‌‌లో మార్పులు చేసి జేఎన్‌‌యూ ప్రొఫెసర్‌‌ బీఎస్‌‌ బాలాజీ కొత్త బ్రెయిలీ లిపిని అందుబాటులోకి తెచ్చారు. లాక్‌‌ అండ్‌‌ కీ కాన్సెప్ట్‌‌తో దీన్ని తయారుచేసినట్టు బాలాజీ చెప్పారు. ఇప్పటివరకున్న పద్ధతిలో చూపులేని స్టూడెంట్స్‌‌ పూర్తిస్థాయిలో కెమికల్‌‌ రియాక్షన్స్‌‌ నేర్చుకోవడం కష్టమని, అందుకే దానిలోని లోపాలను సవరించి కొత్త లిపిని రూపొందించినట్టు తెలిపారు. ఈ మోడల్‌‌ ద్వారా చూపున్న వాళ్లు కూడా ఈజీగా కెమికల్‌‌ రియాక్షన్స్‌‌ నేర్చుకోవచ్చని, టీచింగ్‌‌ ప్రొఫెసర్స్‌‌కు, టీచర్లకు బ్రెయిలీ లిపి రానవసరం లేదన్నారు. ఈ లాక్‌‌ అండ్‌‌ కీ మోడల్‌‌లో 3డి టెక్నాలజీని వాడామని, బ్రెయిలీ కీస్‌‌తోపాటు ఆల్ఫాన్యూమరిక్‌‌ అక్షరాల్నీ చేర్చినట్టు పేర్కొన్నారు. కొన్ని రకాల ఫజిల్‌‌ కార్డుల ద్వారా కెమికల్‌‌ రియాక్షన్స్‌‌ను ఆరు మోడల్స్‌‌లో పూర్తి చేయవచ్చని, ఎలిమెంట్స్‌‌, సంఖ్యలు, ఏరో మార్క్స్‌‌, ప్లస్‌‌, మైనస్‌‌ వంటి సంకేతాల్ని సూపర్‌‌ స్క్రిప్ట్, సబ్‌‌ స్క్రిప్ట్ అనే రెండు భాగాలుగా విభజించినట్టు వివరించారు. ఈ మోడల్‌‌ అమలు కోసం నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్‌‌ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్‌‌సీఈఆర్‌‌టీ)తోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలను సంప్రదించనున్నట్టు బాలాజీ వెల్లడించారు.

Latest Updates