రాజన్నసిరిసిల్లలో నేత కార్మికుడు ఆత్మహత్య

రాజన్న సిిరిసిల్ల : అప్పుల బాధ తట్టుకోలేక నేత కార్మికుడు సూసైడ్ చేసుకున్నాడు. ఈ సంఘటన రాజన్నసిరిసిల్ల జిల్లాలో శనివారం జరిగింది. సారయ్య (70) అనే నేత కార్మికుడు ఇవాళ మధ్నాహ్నం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయనకు భార్య శశికళ, ఇద్దరు కూతుళ్లు సారిక, శ్యామల ఉన్నారు. కూతుళ్లకు పెళ్లిలయ్యాయి. దాసరి సారయ్య కుమారుడు కూడా పది సంవత్నరాల క్రితం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు గ్రామస్థులు. ఆత్మహత్యకు పేదరికమే కారణంగా చెబుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Latest Updates