నేత‌న్న‌ల‌ను ప్రభుత్వాలు ఆదుకోవాలె

యాదాద్రి భువ‌న‌గిరి జిల్లా : లాక్ డౌన్ కార‌ణంగా పూర్తిగా ఉపాధి కోల్పోయామ‌ని కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఆర్థిక సాయం అందించాల‌ని ఆందోళ‌న చేస్తున్నారు చేనేత కార్మికులు. గురువారం యాదాద్రి భువ‌న‌గ‌రి జిల్లా, అర్భ‌న్ కాల‌నీలోని చేనేత మొగ్గాల‌ను ప‌రిశీలించారు జిల్లా చేనేత కార్మిక సంఘం అధ్య‌క్షుడు క‌స్తూరి బిక్ష‌ప‌తి. ఈ సంద‌ర్భంగా ఆయ‌న చేనేత కార్మికుల క‌ష్టాల‌ను అడిగి తెలుసుకున్నారు. కూలి చేసుకుంటే ఇంత ముద్ద దొరుకుతుందని.. గత నెల రోజులుగా పనులు లేక‌ పస్థులు ఉండే పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు చేనేత కార్మికులు. చేసుకుందామంటే పని లేదు. చేసేదేమీలేక చేనేత మొగ్గల వద్దే అష్ట చమ్మ ఆటలాడుతున్నామ‌ని చెప్పారు.

యాదాద్రి భువనగిరి జిల్లాతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో ఉండే చేనేత కార్మికుల కుటుంబాలు పనులు లేక అవస్థలు పడుతున్నార‌ని ఆవేదన వ్యక్తం చేశారు. పట్టు చీరలు నేద్దాం అంటే వాటికి సంబందించిన మెటీరియల్ సఫ్లయ్ మార్కెట్ లో లేకపోవడంతో చేనేత మొగ్గం శబ్దం లేకుండా పోయిందన్నారు. పని చేసుకుంటే తప్ప బతకాలేని జీవితాలు త‌మ‌వ‌ని.. చేనేత మీద ఆధారపడే జీవిస్తున్నామ‌ని చెప్పారు. వెంటనే కేంద్ర‌, రాష్ట్ర‌ ప్రభుత్వాలు ఆదుకొని ఆర్థిక సాయం ప్ర‌క‌టించాల‌ని కోరుతున్నారు నేత‌న్న‌లు.

Latest Updates