చెన్నై రోడ్లపై కరోనా ఆటో..

కరోనా వైరస్ ప్రపంచం మొత్తాన్ని గడగడలాడిస్తోంది. దాని బారిన పడి ఇప్పటివరకు చనిపోయిన వారి సంఖ్య దాదాపు రెండు లక్షలకు చేరువలో ఉంది. వైరస్ నియంత్రణ కోసం ప్రధాని మోడీ దేశవ్యాప్తంగా మే 3 వరకు లాక్డౌన్ విధించారు. అయినా ప్రజలు మాత్రం ఏదో ఒక సాకు చెప్పి రోడ్ల మీదకు వస్తూనే ఉన్నారు. పోలీసులు ఫైన్లు వేసినా, బండ్లు సీజ్ చేసినా రోడ్ల మీదకు రావడం మాత్రం తగ్గడం లేదు. దాంతో చాలా మంది ప్రముఖులు జనహితాన్ని కోరుతూ సోషల్ మీడియా వేదికగా రోడ్ల మీదకు రావొద్దని వేడుకుంటున్నారు. మాస్కులు లేకుండా రోడ్ల మీదకి రావొద్దని, అలా మాస్కు లేకుండా రోడ్డెక్కితే ఫైన్లు వేస్తామని కూడా పోలీసులు హెచ్చరిస్తున్నారు. అయినా కూడా ప్రజలు మాత్రం ఈ నియమాలన్నింటిని పెడచెవిన పెడుతున్నారు.

తాజాగా చెన్నైకి చెందిన ఒక ఆర్టిస్ట్ కరోనా మహమ్మారి గురించి జనాల్లో అవగాహన కల్సించడానికి ఓ కొత్త ప్రయత్నం చేశాడు. ఓ ఆటోను కరోనా మహమ్మారిలాగా కొమ్ములతో తయారుచేసి.. రోడ్లపైకి వచ్చే వారిని హెచ్చరిస్తున్నాడు. మాస్కులు పెట్టుకోకపోతే కరోనా వస్తుందని.. అందుకే మాస్కులు ధరించి.. సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయాలని కోరుతున్నాడు.

‘మాస్కులు ధరించని వారిలో అవగాహన కల్పించడమే నా లక్ష్యం. మాస్కులు ధరించకపోతే ఫైన్ కట్టాల్సి వస్తుంది. కరోనాకు మందు లేదు నియంత్రణ ఒక్కటే మార్గం’ అని ఆ కళాకారుడు అన్నారు.

కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రకారం.. ఇప్పటివరకు తమిళనాడులో 1,683 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ కేసులకు సంబంధించి 752 మంది రికవరీ కాగా.. 20 మంది చనిపోయారు.

For More News..

హౌజింగ్ మినిష్టర్ కు కరోనా పాజిటివ్

Latest Updates