ధోనికి మరో నిక్‌ నేమ్‌

చాలా మంది వారి అసలు పేర్లతో కాకుండా నిక్ నేమ్ లతో ఎక్కువగా ఫేమస్ అవుతుంటారు. నిక్ నేమ్స్ చెబితేనే గుర్తుపడుతుంటారు. అలాంటి వారిలో సెలబ్రిటీలు చాలా మందే ఉన్నారు. సినీ నటులతో పాటు స్పోర్ట్ ప్లేయర్లకు నిక్ నేమ్స్ ఉన్నాయి. ముఖ్యంగా భారత క్రికెట్ ప్లేయర్ మహేద్ర సింగ్ ధోనికీ చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. గ్రౌండ్ లో ఉంటే చాలు..భద్రతా సిబ్బందిని దాటుకు మరీ వచ్చి ఆయనకు షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్తుంటారు. అంతేకాదు తమ అభిమాన క్రికెటర్ ధోనీని రకరకాల నిక్ నేమ్ లతో పిలుస్తుంటారు. MSD, MS, MAHI చాలా పేర్లే ఉన్నాయి.

ప్రస్తుతం ఆ పేర్ల లిస్టులో మరో నిక్ నేమ్ వచ్చింది. అదే.. ‘తాలా’. ధోనిని చెన్నై సూపర్ కింగ్స్(CSK) అభిమానులు ‘తాలా’ అని ముద్దుగా పిలుచుకుంటారు. తాలా అంటే తమిళంలో నాయకుడు అని అర్థం. ఎంతో అభిమానం, ప్రేమ, గౌరవంతో పిలుస్తున్నందున ఆ పేరు అంటే ఎప్పటికీ తనకు ప్రత్యేకమేనని అంటున్నాడు ధోని. CSK ఫ్యాన్స్‌ ఆ పేరుతో పిలవడం నా అదృష్టమన్నారు ధోని.  అంతేకాదు CSK  ఫ్యాన్స్‌ నాకు, మా టీమ్‌కు ఎప్పుడూ మద్దతిచ్చారని… వారిని మరిచిపోన్నాడు ధోని .

Latest Updates