థ్యాంక్స్ దేవుడా.. అభినందన్ రాకపై చెన్నై హోం గార్డ్స్ పూజలు

Chennai Home Guards Organise Prayers Ahead Of Wing Commander Abhinandan's Return From Pakistan

చెన్నై: ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్ విడుదల కోసం దేశమంతా దేవుడికి మొక్కింది. పాక్ చెర నుంచి క్షేమంగా తిరిగి రావాలని ప్రార్థించింది. ఆయనను శుక్రవారం విడుదల చేస్తామని పాక్ ప్రధాని ప్రకటించగానే 130 కోట్ల మంది భారతీయులు ఊపిరి పీల్చుకున్నారు. తమ హీరో వస్తున్నాడని కొందరు.. తమ ఇంటి బిడ్డే ప్రమాదం నుంచి బయటపడ్డాడన్నట్టు మరికొందరు సంబరాలు చేసుకుంటున్నారు.

ప్రత్యేక పూజలు

ఆయన రాక గురించి శుభవార్త తెలియడంతో తమిళనాడు హోం గార్డ్స్ ప్రత్యేక పూజలు చేశారు. చెన్నైలోని కాళికాంబ ఆలయంలో అభినందన్ ను విడిపించినందుకు అమ్మకు థ్యాంక్స్ చెబుతూ పూజలు నిర్వహించారు చెన్నై హోం గార్డులు, వారి కుటుంబ సభ్యులు.

Chennai Home Guards Organise Prayers Ahead Of Wing Commander Abhinandan's Return From Pakistan

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అభినందన్ క్షేమంగా భారత్ కు తిరిగి రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. దేశ రక్షణ కోసం పాక్ యుద్ధ విమానాలతో పోరాడుతూ పాక్ లో పడిపోయిన ఆయనను విడుదల చేయడం తప్ప ఆ దేశానికి మరో మార్గం లేదన్నారు. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ శాంతి కోసం అని చెబుతున్నా.. కేవలం జెనీవా ఒప్పందంలో భాగంగా తప్పక విడుదల చేస్తున్నారని అన్నారు.

Latest Updates