కరోనా రోగి దగ్గర అధిక మొత్తంలో ఫీజు వ‌సూలు.. ప్రైవేట్ హాస్పిటల్ అనుమ‌తి రద్దు

చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుప‌త్రి క‌రోనా పేషెంట్ కు ట్రీట్‌మెంట్ పేరుతో అధిక మొత్తంలో చార్జ్ చేసిన‌ట్టు ఆరోప‌ణ‌లు రావ‌డంతో తమిళనాడు ఆరోగ్య విభాగం ఆ ఆసుప‌త్రికి అనుమ‌తులు ర‌ద్దు చేసింది. బెవెల్ హాస్పిటల్ అనే ప్రైవేట్ ఆసుప‌త్రి 19 రోజుల మెడిక‌ల్ ట్రీట్‌మెంట్ కోసం ఆ పేషెంట్ నుండి రూ .22.2 లక్షలు వసూలు చేసినట్టు తెలియ‌డంతో ప్ర‌భుత్వం ఆ ఆసుపత్రిలో చికిత్స అనుమతిని రద్దు చేసింది. దీంతో కరోనావైరస్ రోగులకు చికిత్స చేయడానికి ఆ హాస్పిట‌ల్ యాజ‌మాన్యం నిరాకరించింది.

రాష్ట్రంలో ప్రైవేట్ ఆసుప‌త్రులు కరోనావైరస్ రోగుల నుండి అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నార‌న్న‌ ఫిర్యాదులు రావ‌డంతో, తమిళనాడు ప్రభుత్వం ఆ ఆసుపత్రులలో వైద్య చికిత్సల ఛార్జీలను రెగ్యులరైజ్ చేసింది. రోగుల నుండి మరిన్ని ఫిర్యాదులు వస్తే ప్రైవేటు ఆసుపత్రులపై చర్యలు తీసుకుంటామని కూడా ఆరోగ్య శాఖ తెలిపింది.

Latest Updates