చెన్నై కింగ్స్ రుతురాజ్‌‌కు మరో రెండు టెస్టులు

బయో బబుల్‌‌లోకి 11 మంది సీఎస్‌‌కే స్టాఫ్‌‌

దుబాయ్‌‌: కరోనా బారిన పడిన చెన్నై సూపర్​ కింగ్స్‌‌ (సీఎస్‌‌కే) యంగ్‌‌ బ్యాట్స్‌‌మన్‌‌  రుతురాజ్‌‌ గైక్వాడ్‌‌  ఇంకా కోలుకోలేదు. అతనికి మరో రెండుసార్లు టెస్టు నిర్వహించనున్నారు. ఆ రెండింటిలోనూ నెగెటివ్‌‌ వస్తేనే అతడిని బయో బబుల్‌‌లోకి అనుమతిస్తారు. దీంతో ఐపీఎల్13వ సీజన్‌‌లో ఆరంభ మ్యాచ్‌‌లకు రుతురాజ్‌‌ దూరం కానున్నాడు. పాజిటివ్‌‌ తేలిన దీపక్‌‌ చహర్ కరోనాను జయించి ఇప్పటికే జట్టుతో కలిసి ప్రాక్టీస్‌‌ చేస్తున్నాడు. మరో 11 మంది చెన్నై స్టాఫ్‌‌కు తాజా టెస్టుల్లో నెగెటివ్‌‌ అని తేలడంతో వాళ్లు కూడా బయో బబుల్‌‌లో సీఎస్‌‌కే టీమ్‌‌తో జాయిన్‌‌ అయ్యారు. ఆది, సోమవారాల్లో నిర్వహించే రెండు టెస్టుల్లో నెగెటివ్‌‌ వస్తే రుతురాజ్‌‌ కూడా టీమ్‌‌ హోటల్‌‌కు వస్తాడని సీఎస్‌‌కే సీఈవో కాశీ విశ్వనాథన్‌‌ చెప్పారు.

 

Latest Updates