3 బకెట్ల నిండా కాయిన్స్ తో ఎలక్షన్ నామినేషన్

తమిళనాడు : ఎన్నికలవేళ పాపులారిటీ కోసం నాయకులు రకరకాల ఫీట్లు చేస్తుంటారు. కొందరు నామినేషన్ టైమ్ లోనూ తమదైన స్టైల్ చూపిస్తుంటారు. తమిళనాడులో అమ్మా మక్కల్ దేశీయ కచ్చి పార్టీ నాయకుడు కుప్పాల్ జీ దేవదాస్ ఇలాగే వెరైటీగా నామినేషన్ వేసి అందరి దృష్టినీ ఆకర్షించారు.

సౌత్ చెన్నై లోక్ సభ నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నారు కుప్పాల్ జీ. చివరిరోజు నామినేషన్ వేసిన ఆయన… డిపాజిట్ మనీని కాయిన్స్ లో చెల్లించాడు. 3 బకెట్ల నిండా కాయిన్స్ పట్టుకొచ్చాడు. ఒక్కోదాంట్లో 10 రూపాయల కాయిన్స్.. 5 రూపాయల కాయిన్స్.. 1 రూపీ కాయిన్స్ వేర్వేరుగా పట్టుకొచ్చాడు. వాటిని లెక్కించిన తర్వాత నామినేషన్ పేపర్లు తీసుకున్నారు అధికారులు.

తమిళనాడులో ఇలాంటి స్టంట్లు కొత్తేంకాదు. గతంలో కోయంబత్తూరులో ఎడ్ల బండిని లాక్కొస్తూ నామినేషన్ వేశాడు ఓ నాయకుడు.

గతేడాది ఇండోర్ లో ఓ వ్యక్తి 10వేల రూపాయల ఒక రూపాయి కాయిన్స్ తో నామినేషన్ వేశాడు. అప్పుడు రిటర్నింగ్ ఆఫీసర్ శశ్వత్ శర్మ.. ఐదుగురు అధికారులతో వాటిని లెక్కించారు. మొత్తం లెక్కించడానికి 90 నిమిషాలు పట్టింది.

Latest Updates