చెన్నై మెట్రోలో ఫుట్‌ ఆపరేటెడ్‌ లిఫ్ట్‌

  • దేశంలోనే ఈ లిఫ్ట్‌ ఏర్పాటు చేసిన ఫస్ట్‌ మెట్రో
  • కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు

చెన్నై: కరోనా మహమ్మారి రోజు రోజు వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో దాన్ని అరికట్టేందుకు ది చెన్నై మెట్రో రైల్‌ లిమిటెడ్‌ (సీఎమ్‌ఆర్‌‌ఎల్‌) కొత్త ఆలోచనతో ముందుకు వచ్చింది. ఇక నుంచి మెట్రో స్టేషన్లలో ఫుట్‌ ఆపరేటెడ్‌ లిఫ్ట్‌లను ఏర్పాటు చేయనుంది. ట్రయల్‌ వర్షన్ కింద కోయంబేడులోని సీఎమ్‌ఆర్‌‌ఎల్‌ హెడ్‌క్వార్టర్స్‌లో దీన్ని ఏర్పాటు చేసింది. దేశంలోనే ఈ తరహా లిఫ్ట్‌ను ఏర్పాటు చేసిన మెట్రో ఇదే. ఇది సక్సెస్‌ అయితే మిగతా స్టేషన్లలో కూడా ఏర్పాటు చేస్తామని అధికారులు చెప్పారు. దీంతో పాటు స్టేషన్‌లో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెప్పారు. వార్నింగ్‌ స్టిక్కర్లు ఏర్పాటు చేయడం, స్టేషన్లలో సోషల్‌ డిస్టెంసింగ్‌ పాటించేలా మార్కింగ్‌ చేయడం, ట్రైన్లలో సిట్ల దగ్గర కూడా మార్క్‌ చేయడం చేస్తున్నట్లు చెప్పారు. లాక్‌డౌన్‌ టైంలో కూడా స్టేషన్‌ మెయింటనెన్స్‌ కోసం స్టాఫ్‌లోని 25 శాతం మంది పనిచేశారని అన్నారు.

Latest Updates