చెన్నై సూప‌ర్ కింగ్స్ నుండి హ‌ర్భ‌జ‌న్‌ ఔట్‌

టీమిండియా మాజీ స్పిన్న‌ర్ హ‌ర్భ‌జ‌న్ సింగ్‌ను వ‌దులుకుంది చెన్నై సూప‌ర్ కింగ్స్ టీమ్‌. రిటెన్ష‌న్ డే నాడు ట్విట‌ర్‌ లో హ‌ర్భ‌జ‌నే ఈ విష‌యాన్ని తెలిపాడు. చెన్నై టీమ్ త‌న‌ను రిటేన్ చేయ‌లేద‌ని భ‌జ్జీ చెప్పాడు. చెన్నైతో నా కాంట్రాస్ట్ ముగిసిపోయే స‌మ‌యం వ‌చ్చింది. ఈ టీమ్‌ కు ఆడ‌టం గొప్ప అనుభ‌వం. మ‌రుపురాని జ్ఞాప‌కాలు, గొప్ప స్నేహితులు ఈ టీమ్‌ లో ఉన్నారు.

చెన్నై టీమ్ మేనేజ్‌ మెంట్‌ కు కృత‌జ్ఞ‌త‌లు అని హ‌ర్భ‌జన్ ట్వీట్ చేశాడు. హ‌ర్భ‌జ‌న్ గ‌తేడాది యూఏఈలో జ‌రిగిన ఐపీఎల్ నుంచి త‌ప్పుకున్న విష‌యం తెలిసిందే. అంత‌కుముందు సీజ‌న్‌ లో చెన్నై త‌ర‌ఫున 11 మ్యాచ్‌ లు ఆడి 19 వికెట్లు తీసుకున్నాడు. భ‌జ్జీని వ‌దులుకోవ‌డం వ‌ల్ల చెన్నైకి రూ.2 కోట్లు మిగిలాయి. అత‌నితోపాటు రైనా, విజ‌య్‌, చావ్లాల‌ను కూడా చెన్నై వ‌దులుకునే అవ‌కాశాలు ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి.

Latest Updates