IPL : ఢిల్లీ టార్గెట్-180

చెన్నై : ఢిల్లీతో జరుగుతున్న మ్యాచ్ లో చెన్నై ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ ఓడి పస్ట్ బ్యాటింగ్ చేసిన ధోనీసేన నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 179 రన్స్ చేసింది. చెన్నైకి మంచి ప్రారంభం దక్కలేదు. ఓవర్ కు ఒక్క రన్ చొప్పున 3 ఓవర్లకు 3 రన్సే చేశారు. ఓపెనర్ షేన్ వాట్సన్(0) మరోసారి నిరాశ పరిచాడు.

ఆ తర్వాత వచ్చిన సురేష్ రైనా బౌండరీలు బాదుతూ స్కోర్ రన్ రేట్ పెంచాడు. ఈ క్రమంలోనే హాఫ్ సెంచరీ చేశాడు రైనా.  చెన్నై కనీసం 130 రన్స్ అయినా చేస్తుందా అనే క్రమంలో చివర్లో వచ్చిన జడేజా, ధోనీ హిట్టింగ్స్ ఆడటంతో గౌరవప్రధమైన స్కోర్ చేసింది ధోనీసేన.

చెన్నై ప్లేయర్లలో..వాట్సన్(0), డుప్లెసిస్(39), రైనా(59), జడేజా(25), ధోనీ(44- నాటౌట్), అంబటి రాయుడు(05- నాటౌట్) రన్స్  చేశారు.

ఢిల్లీ బౌలర్లలో..సుచిత్(2), మోరీస్(1), అక్షర్ పటేల్(1) వికెట్లు తీశారు.

Latest Updates