చెన్నై తడబ్యాటు: ముంబై టార్గెట్-115

షార్జా: ఐపీఎల్ -13లో మరో ఇంట్రెస్టింగ్ మ్యాచ్ జరిగింది. శుక్రవారం  ముంబై ఇండియన్స్‌ తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై మరోసారి చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది. టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన  చెన్నై సూపర్‌ కింగ్స్‌  నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 114 రన్స్ మాత్రమే చేయగలిగింది. చెన్నైకి మంచి ప్రారంభం దక్కలేదు.

అతి తక్కువ స్కోరుకే బ్యాట్స్‌మెన్‌ పెవిలియన్‌ కు క్యూ కట్టారు. ముంబై బౌలర్ల ధాటికి రుతురాజ్‌ గైక్వాడ్(0), డుప్లెసిస్‌(1), అంబటి రాయుడు(2), జగదీశన్‌(0), మహేంద్ర సింగ్‌ ధోనీ(16),  జడేజా(7), దీపక్‌ చాహర్‌(0),  శార్దూల్‌ ఠాకూర్‌(11),  ఇమ్రాన్‌ తాహీర్(13 నాటౌట్) తక్కువ రన్స్ కే‌ పెవిలియన్‌ బాట పట్టారు. ఆల్ రౌండర్ శామ్‌ కరన్‌ ఒక్కడే (52  హాఫ్ సెంచరీ)  ఎక్కువ రన్స్ చేశాడు.

ముంబై బౌలర్లలో ట్రెంట్‌ బౌల్ట్‌ 4  వికెట్లు తీయగా, బుమ్రా, రాహుల్‌ చాహర్‌ చెరో రెండు వికెట్లు పడగొట్టగా నాథల్‌ కౌల్టర్‌ నైల్ కు ఒక వికెట్ దక్కింది.

Latest Updates