చెన్నై VS ఢిల్లీ: కాసేపట్లో క్వాలిఫైయర్‌-2 మ్యాచ్‌

IPL టోర్నీలో భాగంగా ఇవాళ(శుక్రవారం) జరిగే క్వాలిఫైయర్‌-2 మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌తో IPL ఫైనల్లో ముంబై ఇండియన్స్‌ జట్టుతో తలపడే టీం ఏదో తేలిపోతుంది. వరుసగా రెండో సీజన్‌లో కూడా IPL ఫైనల్‌కి చేరేందుకు చెన్నై సూపర్‌ కింగ్స్‌ సిద్ధమైంది. ఇందులో భాగంగా క్వాలిఫైయర్‌-2 మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది.

మరోవైపు ఢిల్లీ టీం యువ ఆటగాళ్లతో కలకలలాడుతుంది. ఈ సీజన్‌లో యువ క్రికెటర్లు పృథ్వీ షా, రిషబ్‌పంత్‌ ,శ్రేయాస్‌ అయ్యర్‌లు విజయాల్లో కీలకపాత్ర పోషించారు. గాయం కారణంగా IPL కు దూరమైన సఫారీ బౌలర్‌ కగిసో రబాడ స్థానంలో ట్రెంట్‌ బౌల్ట్‌, ఇషాంత్‌ శర్మ రాణిస్తుండటం..వెటరన్‌ స్పిన్నర్‌ అమిత్‌ మిశ్రా అనుభవం జట్టుకు అండగా నిలుస్తున్నారు. మొత్తంగా ఈ మ్యాచ్‌లో విజయం సాధించి ఐపిఎల్‌ ఫైనల్‌కు చేరుకుని చరిత్ర సృష్టించాలని ఢిల్లీ క్యాపిటల్స్‌ ఆసక్తి చూపిస్తోంది.