ప్రేమించాలంటూ వేధింపులు: బీటెక్​ స్టూడెంట్ ​సూసైడ్​

చేవెళ్ల, వెలుగు: ప్రేమించాలంటూ మూడు సంవత్సరాలుగా వేధిస్తుండడంతో బీటెక్ విద్యార్థిని పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. శంకర్ పల్లి సీఐ లింగయ్య, కుటుంబసభ్యుల వివరాల ప్రకారం.. వికారాబాద్​ జిల్లా ధారూరు మండలం కొండాపూర్​ కుర్దు గ్రామానికి చెందిన అల్లాడ సౌమ్యారెడ్డి(21) దొంతాన్ పల్లి వద్ద గల ఇక్ఫాయ్ లో బీటెక్​ మూడో  సంవత్సరం చదువుతోంది. శంకర్ పల్లిలో ఉండే పిన్ని మంజుల వద్ద ఉంటూ ప్రతిరోజు కాలేజీకి వెళ్లి వచ్చేది.

వికారాబాద్​ జిల్లా మర్పల్లి మండలం కోటమర్పల్లి గ్రామానికి చెందిన శ్రీరాంరెడ్డి నగరంలోని ఓ ప్రైవేటు కాలేజీలో డిగ్రీ చదువుతున్నాడు. వరుసకు బంధువైన సౌమ్యారెడ్డిని మూడేళ్లుగా శ్రీరాం ప్రేమించాలంటూ వేధిస్తున్నాడు. అబ్బాయి తండ్రికి ఫోన్​చేసి చెప్పినా పట్టించుకోకపోవడంతో సౌమ్యారెడ్డి ఈ నెల 30న పిన్ని వాళ్ల ఇంట్లో పురుగుల మందు తాగింది. అదే సమయంలో తల్లి అనంతమ్మ ఫోన్​చేయడంతో తాను పురుగుల మందు తాగానని, చనిపోతున్నానని చెప్పింది. కంగారుపడ్డ తల్లి కుటుంబసభ్యులకు సమాచారం ఇవ్వడంతో సిటీలోని హాస్పిటల్ కి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో సౌమ్య మృతిచెందింది.

మరిన్ని వెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Latest Updates