ఛత్తీస్ గడ్ లో తెగబడ్డ నక్సల్స్.. ముగ్గురు వ్యక్తులు మృతి

ఛత్తీస్ గఢ్ లో నక్సల్స్ తెగబెడ్డారు. డీజిల్ ట్యాంకర్ ను IED తో పేల్చిన ఘటనలో ముగ్గురు పౌరులు మృతి చెందారు. కంకెర్ జిల్లాలోని కొస్రొండా, తుమపాల్ గ్రామాల మధ్య ఈ దారుణం జరిగింది. ఈ దాడిలో ట్యాంకర్ డ్రైవర్ సహా మరో ఇద్దరు వ్యక్తులు మరణించారు. రౌగత్ ఏరియాలోని రైల్వే ట్రాక్ పనుల కోసం ఉంచబడిన ఆ ట్యాంకర్ ను లక్ష్యంగా చేసుకొని నక్సల్స్  ఐఈడీ బాంబు ను పేల్చారని బస్తార్ రేంజ్ పోలీస్ ఆఫీసర్ వివేకానంద్ సిన్హా తెలిపారు. ఈ ఘటన గురించి సమాచారమందుకున్న ఎస్.డీ.ఆర్.ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి సహయక చర్యలు చేపడుతున్నాయి.

Latest Updates