రాజన్నను దర్శించుకున్న ఛత్తీస్ గఢ్ (దంతెవాడ) ఎమ్మెల్యే

రాజన్న సిరిసిల్ల జిల్లా: వేములవాడ రాజన్న ఆలయాన్ని కుటుంబ సభ్యులతో పాటు దర్శించుకున్నారు ఛత్తీస్ ఘడ్ (దంతేవాడ) ఎమ్మెల్యే దేవుతి కర్మ. జడ్ ప్లస్ కేటగిరి బందో బస్తు తో వచ్చిన ఎమ్మెల్యే కు వేములవాడ పోలీసులు మరింత భద్రత ఏర్పాటు చేశారు. ఆలయ అధికారులు ఆమెకు ఘ‌న స్వాగతం ప‌లికి రాజ‌న్న ద‌ర్శ‌నం చేయించారు. ద‌ర్శ‌నం అనంత‌రం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం అన్నా, దేవాలయాల‌న్నా త‌న‌కెంతో అభిమానమ‌ని తెలిపారు. వేములవాడ, మేడారం రెండూ ఎంతో శక్తి వంత మైన ఆలయాలని, వేములవాడ కి రావాలని ఎప్పటి నుండో అనుకున్నా కానీ అనివార్య కారణాల వల్ల వీలు కాలేదని ఆమె అన్నారు. రాజన్న ను దర్శించుకోవడం ఎంతో సంతోషంగా ఉంద‌ని అన్నారు. భవిష్యత్ లో రాజ‌న్న ఆల‌యం గొప్ప క్షేత్రం గా మారుతుంద‌ని అన్నారు.

Latest Updates