గుండెపోటుతో గార్డెన్ లో కుప్పకూలిన ఛత్తీస్‌ఘర్ మాజీ సీఎం

ఛత్తీస్‌ఘర్ మాజీ సీఎం అజిత్ జోగి అనారోగ్యంతో ఆస్పత్రి పాలయ్యారు. ఆయన ఈ రోజు ఉదయం గుండెపోటుతో శ్రీ నారాయణ ఆస్పత్రిలో చేరారు. 74 ఏళ్ల జోగి ఈ రోజు తన ఇంటి గార్డెన్ లో కుప్పకూలిపోయాడు. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే వైద్యులను పిలిపించారు. వైద్యులు జోగిని పరీక్షించి గుండెపోటుగా నిర్ధారించారు. ఆ తర్వాత ఆయనను మధ్యాహ్నం 12:30 గంటలకు ఆసుపత్రిలో చేర్చారు. శ్రీ నారాయణ ఆస్పత్రి విడుదల చేసిన మెడికల్ బులెటిన్ ప్రకారం.. ప్రస్తుతం జోగి వెంటిలేటర్‌పై సీరియస్ కండీషన్ లో ఉన్నారు.

For More News..

తల్లి చనిపోయిందన్న బాధలో కూతురు ఆత్మహత్య

తెలంగాణలో ఎన్ఆర్ఐ సెల్ సరిగా లేదు

మిల్లులో ధాన్యం కోత పెడితే మాకు చెప్పండి

Latest Updates