అండర్ వరల్డ్ డాన్ చోటా రాజన్‌కు 8 ఏళ్లు జైలు శిక్ష

ఓ హోటల్ యజమానిపై దాడి చేసి అతనిపై హత్యాయత్నానికి ప్రయత్నించిన కేసులో అండర్ వరల్డ్ డాన్ చోటా రాజన్‌ సహా మరో నలుగురుకి ముంబై కోర్టు ఎనిమిదేళ్లు జైలు శిక్ష విధించింది. 2012లో రాజన్ అనే గ్యాంగ్ స్టర్ తనను చంపేందుకు యత్నించారని బీఆర్ షెట్టీ అనే హోటల్ యజమాని కోర్టు లో కేసు నమోదు చేశారు. తన స్నేహితుడిని కలవడానికి వెళుతుండగా అంథేరీ ప్రాంతంలో తనపై రాజన్ కాల్పులకు పాల్పడ్డాడని తన ఫిర్యాదులో పేర్కొన్నాడు .

ఈ కేసును విచారణ చేసిన ముంబై కోర్టు వారిని ఆయుధాల చట్టం కింద నేరస్తులుగా ప్రకటించి, వారికి  8 ఏండ్ల జైలు శిక్ష ఖరారు చేసింది. శిక్షతో పాటు రూ.5 లక్షలు జరిమానా కట్టాలని చోటారాజన్‌ను కోర్టు  ఆదేశించింది. రాజన్ తో పాటు శిక్ష ఖరారైన వారిలో నిత్యానంద్ నాయక్, సెల్విన్ డానియల్,  రోహిత్ తంగప్పన్ జోసెఫ్ అలియాస్ సతీష్ కలియా, దిలీప్ ఉపాధ్యాయ్, తల్వీందర్ సింగ్ ఉన్నారు.

Latest Updates