పక్కా క్రైమ్ పార్టనర్ షిప్ అంటే వీళ్లదేనేమో?

న్యూఢిల్లీ: రోజు మొత్తంలో ఏదైనా వింతను చూడలేదని మీరు బాధపడుతున్నారా? అయితే ఈ వీడియో మీ కోసమే మరి. ఫారెస్ట్ లోని యానిమల్స్, ప్రకృతి అందాలతోపాటు సాహసికుల వీడియోలను ఐఎఫ్ఎస్ ఆఫీసర్ సుశాంత నందా తరచూ సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. ఇప్పుడు కూడా ఒక ఫన్నింగ్ వీడియోను ఆయన ట్వీట్ చేశారు. వివరాలు.. టేబుల్ పై ఉన్న ఫుడ్ ను కోడి సాయంతో పిల్లి దొంగిలిస్తుంది. ఎత్తులో ఉండటంతో కోడిపై రెండు కాళ్లతో నిల్చొని, టేబుల్ పైకి వంగి పిల్లి భోజనాన్ని తస్కరించడం ఫన్నీగా ఉంది. వీటికి రక్షణగా మరో రెండు పిల్లులు కింద బాడీగార్డ్స్ లా ఉండటాన్ని నవ్విస్తోంది. ఇద్దరు అసాధారణ భాగస్వాములు కలసి దొంగతనం చేస్తే ఇలా ఉంటుందా అంటూ నెటిజన్స్ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. బాడీగార్డ్స్ ను పెట్టుకొని మరీ చేసిన ఈ పక్కా క్రైమ్ దాదాగిరిలా కనిపిస్తోందంటూ మరొక నెటిజన్ సెటైరికల్ కామెంట్. మరి పిల్లి, కోడి కలసి దొంగతనం చేస్తే ఎలా ఉంటుందో మీరూ ఓ లుక్కేసేయండి.

Latest Updates