చికెన్ రేట్లకు రెక్కలు.. కిలో రూ.180

హైదరాబాద్​, వెలుగు: కరోనా దెబ్బకు పడిపోయన చికెన్ రేట్లకు మళ్లీ రెక్కలొచ్చాయి. లాక్ డౌన్ మొదలైన తర్వాత చికెన్ రేటు క్రమంగా పెరుగుతోంది. వారం కిందట కిలో రూ.80 ఉన్న చికెన్​ఇప్పుడు రూ.180 పలుకుతోంది. చికెన్, కోడి గుడ్లు తింటే కరోనా రాదని ప్రభుత్వ పెద్దలు, నెక్ అసోసియేషన్ ప్రచారం చేయడంతో కొనుగోళ్లు పెరిగాయి. దీంతో గత నెల రోజులుగా నష్టాలు చవిచూసిన పౌల్ట్రీ రైతుల్లో మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి.

అప్పుడు ఫ్రీగా ఇచ్చినా తీసుకోలే..

సోషల్​ మీడియాలో జరిగిన ప్రచారంతో చికెన్​తోపాటు కోడి గుడ్ల ధరలు కూడా అమాంతం పడిపోయాయి. ఫిబ్రవరి రెండో వారం నుంచి మార్చి మూడో వారం వరకు నెల రోజులకుపైగా రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో కిలో చికెన్ రూ.20 నుంచి రూ.40 పలికింది. దీంతో చాలా చోట్ల పౌల్ట్రీ రైతులు ఫ్రీగా చికెన్ పంచినా ప్రజలు తీసుకోని దుస్థితి ఏర్పడింది. ఎవరూ తీసుకోకపోవడంతో కొన్ని ఏరియాల్లో కోళ్లను పూడ్చిన వీడియోలు వైరల్​అయ్యాయి. పౌల్ట్రీ రైతులు ఆర్థికంగా చితికిపోయారు. దీంతో రాష్ట్ర మంత్రులు కేటీఆర్​, ఈటల రాజేందర్​, తలసాని, శ్రీనివాస్​ గౌడ్ చికెన్​ ఫెస్టివల్​ నిర్వహించి మరీ చికెన్​ తినడం ద్వారా కరోనా రాదని ప్రచారం చేశారు. అయినా చికెన్​ కొనుగోళ్లు ఆశించినంతగా పెరగలేదు. పౌల్ట్రీ రైతులు కూడా కోళ్ల పెంపకాన్ని తగ్గించారు. లాక్ డౌన్ మొదలైన తర్వాత సీన్ మారింది. చికెన్  కు డిమాండ్ పెరిగింది. అయితే సరిపడా సప్లై చేసే పరిస్థితి లేక రేట్లు పెరిగాయి.  లైవ్‌‌ కోడి కిలో రూ.70 పలుకుతోంది. స్కిన్​ లెస్​ కిలో రూ.180, విత్​ స్కిన్​ రూ.160 ఉంది.

 

సలామ్ సిస్టర్స్ ధైర్యం చెబుతూ సేవ చేస్తున్నారు

Latest Updates