నిండా మునిగిపోయాం, కోళ్లను ఉచితంగా ఇస్తున్నాం: పౌల్ట్రీ రైతులు

కరోనా వైరస్ కారణంగా పౌల్ట్రీ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. మాంసాహారం తింటే వైరస్ సోకుతుందేమోనన్న భయంతో ప్రజలు వాటి వినియోగాన్ని చాలావరకూ తగ్గించారు. ఈ కారణంగా ఒక్కో రైతు దాదాపు లక్షలాది రూపాయలు నష్ట పోతున్నారు. మార్కెట్ లో కిలో ధర పది రూపాయలు కూడా లేక పోవడంతో వాటికి దాణా పెట్టలేక జనాలకు కోళ్లను ఉచితంగా అందజేస్తున్నారు రైతులు. కోళ్లను ఉచితంగా ఇస్తున్నారనడంతో వాటిని తీసుకెళ్లేందుకు నాన్ వెజ్ ప్రియులు ఎగబడుతున్నారు.

కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలంలోని చెల్పూరు లో కరోనా వైరస్ కారణంగా కోళ్ల  రేటు దారుణంగా పడిపోయింది. సరైన రేటు లేకపోవడంతో పౌల్ట్రీ రైతులు ప్రజలకు ఉచితంగా పంపిణీ చేశారు. సైదాపూర్ మండలంలోని మరో రైతు అయితే బ్రతికున్న కోళ్లనే  గొయ్యి తీసి పాతరేశారు. తమకు లక్షలలో నష్టం వచ్చిందని, నిండా మునిగిపోయామని రైతులు వాపోతున్నారు. ఈ నష్టాల వల్ల తమకు తలలు పట్టుకునే పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు.

Latest Updates