కోడి లేకున్నా చికెన్‌‌.. ల్యాబ్ లో తయారయ్యే చికెన్ కు సింగపూర్ గ్రీన్ సిగ్నల్

ఇప్పుడు చికెన్ తినాలంటే..కోడిని కొయ్యక్కర్లేదు. గుడ్డు కూడా.. కోడి పెట్టక్కర్లేదు.టేస్ట్, ఫ్లేవర్‌‌‌‌లో కొంచెం కూడా తేడా లేకుండా కల్చర్డ్‌‌ చికెన్ వచ్చేసింది! ‘ల్యాబ్‌‌లో తయారయ్యే ఈ గుడ్లు, చికెన్‌‌ని అమ్ముకోవచ్చు’  అని సింగపూర్‌‌‌‌ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.

గుడ్లు, చికెన్ కావాలంటే.. కోళ్లను పెంచాలి. తర్వాత కొయ్యడం, క్లీన్ చేయడం.. ఇదంతా పెద్ద ప్రాసెస్‌‌. అదీగాక మూగ జీవులను చంపుతున్నారు అనే వాళ్లు కొంతమంది! ఇంకోవైపు పెరుగుతున్న మాంసం డిమాండ్‌‌కి తగ్గట్టుగా చికెన్ ప్రొడ్యూస్ చేయలేకపోతున్నారు. ఇలాంటి సమస్యల్ని దృష్టిలో ఉంచుకొని, చాలారోజుల నుంచి సైంటిస్టులు ల్యాబ్‌‌లోనే చికెన్ సెల్స్‌‌ ఉపయోగించి గుడ్లు, మాంసం తయారు చేయాలని రీసెర్చ్‌‌ చేస్తున్నారు. ఈ రీసెర్చ్‌‌లు ఇప్పటికే చాలా దేశాల్లో సక్సెస్‌‌ అయినా.. ఏ దేశంలోనూ ఇలాంటి మాంసం తయారుచేసి అమ్మేందుకు అనుమతి ఇవ్వలేదు. కానీ, సింగపూర్‌‌‌‌లో ‘ఈట్ జస్ట్’ అనే ల్యాబ్‌‌ వాళ్లు తయారు చేసే కల్చర్డ్‌‌ చికెన్‌‌కి సింగపూర్ గవర్నమెంట్ అనుమతి ఇచ్చింది. కల్చర్డ్‌‌ మీట్‌‌ అమ్మకానికి అనుమతి ఇచ్చిన మొదటి దేశంగా  సింగపూర్‌‌‌‌ నిలిచింది. ఇక మీదట రెస్టారెంట్‌‌లో ల్యాబ్ పెట్టి ఈ చికెన్, గుడ్లు తయారు చేసుకోవచ్చు అన్నమాట. ఇతర రెస్టారెంట్స్‌‌, సూపర్‌‌‌‌ మార్కెట్స్‌‌లోనూ సేల్స్ పెంచడానికి ఈ ల్యాబ్‌‌ అడుగులు ముందుకు వేస్తోంది.  “ మేం తయారు చేసే చికెన్‌‌ని గ్లోబల్ బ్రాండ్‌‌గా మార్చాలనుకుంటున్నాం. ఎన్విరాన్‌‌మెంట్‌‌ని దృష్టిలో పెట్టుకుని ఈ రీసెర్చ్ చేశాం. ఈ మాంసంలో చికెన్ ఫ్లేవర్లో, టేస్ట్‌‌లో కొంచెం కూడా తేడా ఉండదు’ అని ల్యాబ్ సీఈవో జోష్‌‌ టెట్రిక్‌‌ చెప్పాడు.

 

జనాభాకు తగ్గట్టుగా..

సింగపూర్‌‌‌‌ చిన్నగానే ఉంటుంది. కానీ,  జనాభా చాలా ఎక్కువ. ఫుడ్‌‌ కోసం చాలా దేశాల మీద ఆధారపడుతుంది ఈ దేశం. అలా ఇతర దేశాల నుంచే ఇక్కడ ఉంటున్న 57 లక్షల మందికి 90 శాతం ఫుడ్‌‌ సప్లై అవుతోంది. కోవిడ్‌‌ క్రైసిస్ వల్ల ప్రపంచవ్యాప్తంగా ఎగుమతులు, దిగుమతులు  తగ్గిపోయాయి. దాంతో సింగపూర్ చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. ఫుడ్‌‌ సెక్యూరిటీలో భాగంగా 2030 వరకు  కనీసం 30 శాతం ఫుడ్‌‌ని సొంతంగా ప్రొడ్యూస్ చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనికోసం రీసెంట్‌‌గా లోకల్ రైతులకు ఫండింగ్ చేసింది. ఇప్పుడు వాళ్ల ఫుడ్ ప్రొడక్షన్‌‌ పదిశాతం కన్నా తక్కువే!  ‘‘కల్చర్డ్ మీట్‌‌ నిజమైన మాంసం, ప్లాంట్ బేస్డ్ మీట్ కాదు.  ల్యాబ్‌‌లో తయారు చేసే ఈ చికెన్‌‌ రేటు మొదటి ఆరునెలలు.. ట్రెడిషనల్ చికెన్ రేటే ఉంటుంది. తర్వాత కొంచెం, కొంచెం తగ్గిస్తాం. ఫామ్‌‌ చికెన్ కంటే తక్కువ ధరలో కల్చర్డ్‌‌ అందించాలనేదే మా లక్ష్యం’ అన్నాడు టెట్రిక్‌‌.

 

 

Latest Updates