చిదంబరానికి జ్యుడీషియల్ కస్టడీని పొడిగించిన కోర్టు

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరానికి కోర్టులో మరోసారి నిరాశే ఎదురైంది.INX మీడియా అవినీతి కేసులో ఆయన జ్యుడీషియల్ కస్టడీని ఢిల్లీలోని రౌజ్‌ ఎవెన్యూ కోర్టు వచ్చే నెల 3 వరకూ పొడిగించింది. జైలు నుంచి బయటపడేందుకు చిదంబరం తీవ్రంగా ప్రయత్నాలు చేశారు. ఇందులో భాగంగా కొన్ని రోజుల క్రితం ఆయన EDకి సరెండర్ అవుతానని పిటిషన్ పెట్టుకోగా, కోర్టు తిరస్కరించింది. ఇవాళ్టితో ఆయన కస్టడీ ముగియడంతో సీబీఐ అధికారులు చిదంబరాన్ని తీహార్ జైలు నుంచి కోర్టుకు తీసుకురాగా… కస్టడీని అక్టోబర్ 3 వరకూ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం చిదంబరం తీహార్ జైలులో ఉన్నారు.

Latest Updates