కోహ్లీ చేష్టలు కోపం తెప్పించాయి

న్యూఢిల్లీ: గతేడాది (2018–19) ఆస్ట్రేలియా టూర్‌‌కు వచ్చిన సందర్భంగా.. మైదానంలో టీమిండియా కెప్టెన్‌‌ విరాట్‌‌ కోహ్లీ ప్రవర్తన తనకు చాలా కోపం తెప్పించాయని చీఫ్‌‌ కోచ్‌‌ జస్టిన్‌‌ లాంగర్‌‌ అన్నాడు. అయినా ఏనాడూ బయటపడలేదని స్పష్టం చేశాడు. ‘వాస్తవానికి ఆ సిరీస్‌‌లో కోహ్లీని అతిగా కవ్వించొద్దని మా ప్లేయర్లకు సూచించా. దూషణకు కూడా దిగొద్దని చెప్పా. అయినా గ్రౌండ్‌‌లో కోహ్లీ అతిగా సంబురాలు చేసుకున్నాడు. వాటిని చూస్తే చాలా కోపం వచ్చింది.

నేను అతనికి ఓ పంచింగ్‌‌ బ్యాగ్‌‌లా మారిపోయా. సిరీస్‌‌లో మేం పోరాడలేకపోయాం. ఎందుకంటే అప్పటికే మేం చేతులెత్తేశాం. జరిగేదేదో జరుగుతుందని అనుకున్నాం. కానీ మైదానంలో కోహ్లీ ప్రవర్తన చూస్తే ద్వంద్వ ప్రమాణాలు ఉన్నాయని అనిపించింది. ప్రతి విషయంలో మేం చాలా జాగ్రత్తగా ఉండాలని అనుకున్నాం’ అని లాంగర్‌‌ వ్యాఖ్యానించాడు.

 

Latest Updates