సమాచారహక్కు చట్టం పరిధిలోకి సీజేఐ: సుప్రీం

సుప్రీంకోర్టు  ఇవాళ(బుధవారం) మరో సంచలన తీర్పును వెలువరించింది. భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) కార్యాలయం కూడా సమాచార హక్కు (RTI) చట్టం పరిధిలోకి వస్తుందంటూ చరిత్రాత్మక ఆదేశాలు ఇచ్చింది. సీజేఐ కార్యాలయం కూడా ప్రభుత్వ సంస్థేనని, అది కూడా పారదర్శకత చట్టమైన RTI కిందకు రావాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే… పారదర్శకత పేరిట న్యాయవ్యవస్థ స్వతంత్రను తక్కువ చేయలేరని కోర్టు వ్యాఖ్యానించింది.

సీజేఐ కార్యాలయం కూడా RTI పరిధిలోకి వస్తుందంటూ ఢిల్లీ హైకోర్టు 2010 జనవరిలో ఇచ్చిన తీర్పును సమర్ధించింది. చీఫ్‌ జస్టిస్‌ రంజన్‌ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం తీర్పును వెలువరించింది.

Latest Updates