పీఎం కేర్స్ నిధికి ఏడాది పాటు జీతం నుంచి 50 వేలు విరాళం

  • ప్రకటించిన సీడీఎస్ బిపిన్ రావత్

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు ఏర్పాటు చేసిన పీఎం కేర్స్ ఫండ్​కు ఏడాదిపాటు ప్రతి నెలా తన జీతంలోంచి రూ.50 వేలు విరాళంగా ఇచ్చేందుకు చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ ముందుకు వచ్చారు. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి వచ్చే 12 నెలల వరకు తన జీతంలోంచి పీఎం కేర్స్‌ నిధికి నెలకు రూ. 50 వేల చొప్పున విరాళం ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఏడాది పాటు జీతం నుంచి ఆ మొత్తాన్ని తగ్గించి పీఎం కేర్స్ ఫండ్​కు ట్రాన్స్ ఫర్ చేయాలని సంబంధిత అధికారులకు లేఖ రాసినట్లు డిఫెన్స్ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే ఏప్రిల్ నెల శాలరీ నుంచి 50 వేలు జమ చేసినట్లు వెల్లడించాయి. కరోనాపై పోరాటానికి ప్రధాని నరేంద్ర మోడీ ఏర్పాటు చేసిన పీఎం కేర్స్ ఫండ్ కు సీడీఎస్, ఇతర రక్షణ సేవల సిబ్బంది తమ ఒక రోజు శాలరీని అందించాయి.

Latest Updates