మేం టూత్ బ్రష్ గాళ్లమైతే మీరు బూటు పాలిష్ గాళ్లా….?

వరంగల్ అర్బన్ జిల్లా: అసత్యపు మాటలతో, మత విధ్వేషాలు రెచ్చగొట్టి బీజేపీ పార్టీ నాయ‌కులు వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌డియం శ్రీహ‌రి మండిప‌డ్డారు. సోమ‌వారం వరంగల్ అర్బన్ జిల్లాలో ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి లు ప్రెస్ మీట్ నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా క‌డియం శ్రీహ‌రి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు చేసిందేమీ లేదని.. దేవుళ్లు, ఆలయాల పేర్లు చెప్పి బీజేపీ నాయ‌కులు ఓట్లు పొందాలని చూస్తున్నారన్నారు. సర్వమత సామరస్యానికి ప్రతీక తెలంగాణ అని, ప్రశ్నించే తత్వం తెలంగాణ మట్టిలో ఉందని అన్నారు. ఆదివారం బండి సంజయ్ త‌మ పార్టీ నేత‌ల‌పై చేసిన వ్యాఖ్యలపై మండిప‌డుతూ… “మేము టూత్ బ్రష్ గాళ్లమైతే మీరు బూటు పాలిష్ గాళ్లా….?” అని ప్ర‌శ్నించారు. స్మార్ట్ సిటీ నిధుల్లో ఎలాంటి అవినీతి జరగలేద‌ని, అందుకు ప్రెస్ క్లబ్ లో చర్చకు సిద్ధ‌మ‌ని ఆయ‌న అన్నారు.

వినయ్ భాస్కర్ మాట్లాడుతూ.. వరదలు వచ్చినప్పుడు, కరోనాతో ప్రజలు ఇబ్బందులు పడ్డప్పుడు రాని ప్ర‌తిప‌క్ష పార్టీ నాయకులు.. ఇప్పుడొచ్చి మత విధ్వేషాలు రెచ్చగొడుతున్నార‌ని, మీరు రెచ్చగొడితే మేము రెచ్చిపోమని అన్నారు. తొండిగాళ్లకు, తొడగొట్టే నాయకులకు తాము సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని, ప్రజలకే సమాధానం చెప్తామ‌ని అన్నారు

Latest Updates