జయరాం కేసులో ఆరవ రోజు విచారణ

చిగురుపాటి జయరాం కేసులో ఆరవ రోజు విచారణ కొనసాగుతోంది. జయరాం హత్యకేసులో ఒక్కొక్కటిగా నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. సీసీ పుటేజ్, కాల్ డేటాలో కొత్తకోణాలు వెలుగు చూస్తున్నాయి. ప్రధాన నిందితుడు రాకేశ్ రెడ్డి పథకం ప్రకారమే జయరాంను హత్య చేశాడని నిర్ధారణకు వచ్చారు పోలీసులు. హత్యకు ముందు రాకేశ్ రెడ్డి సెల్ ఫోన్లో వీడియోను తీసినట్లు… మర్డర్ సమయంలో రౌడీ షీటర్ నగేష్ మేనల్లుడు విశాల్ అక్కడే ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. ఇవాళ.. రాకేశ్ రెడ్డికి పోలీసుల సంబంధాలపైన విచారణ చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఇబ్రహీంపట్నం ACP మల్లారెడ్డి, నల్లకుంట సీఐకి ఇప్పటికే నోటీసులు ఇచ్చారు. ఇవాళ వారిద్దరినీ విచారించనున్నారు.

Latest Updates