లంచం తీసుకుంటూ పట్టుబడ్డ అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్

లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు ఓ అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్. హైదరాబాద్ చిక్కడపల్లిలోని లేబర్ ఆఫీస్ లో నాలుగువేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ షఫీ. అయితే బాధితుడి నుంచి గతంలోనే లంచంతీసుకున్నట్లు తెలిపారు అధికారులు. మరికొంత నగదు కావాలని బాధితున్ని డిమాండ్ చేశాదు షఫీ. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను సంప్రదించాడు. దీంతో వలపన్నిన అధికారులు అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

Latest Updates