మావితో పుట్టిన గడుగ్గాయి

ఇది సిజేరియన్‌ ఆపరేషన్‌ లోనే అత్యంత అరుదైన ఘటన. గర్భంలో తొమ్మిది నెలలు తనకు రక్షణగా ఉన్న మాయ(మావి) సంచిని తనతోపాటే బయటి ప్రపంచంలోకి తెచ్చేసుకున్నాడు ఈ గడుగ్గాయి. సాధారణంగా ఆపరేషన్‌ లో ఈ సంచిని జాగ్రత్తగా కోసి ఉమ్మనీరు తొలగించి పాపను బయటకు తీస్తారు. కానీ ఈ ఆపరేషన్‌ లో మాయ సంచి మొత్తం ఎలా ఉందో అలాగే బయటకు వచ్చేసింది. ప్రతి లక్ష ఆపరేషన్స్ లో ఒకటి ఇలా అరుదుగా జరుగుతుందని డాక్టర్లు చెబుతున్నారు. ఇంతకీ ఈ బుడ్డోడు పుట్టింది ఎక్కడో చెప్పలేదు కదా.. బ్రెజిల్‌‌‌‌లోని ఎస్పిరిటో శాంటో స్టేట్‌ ప్రయాదా కోస్టా హాస్పిటల్‌‌‌‌లో. తల్లీ బిడ్డ క్షేమంగా ఉన్నారని డాక్టర్లు చెప్పారు.

సహజ ప్రసవాల్లో అరుదుగా, సిజేరియన్‌ లో ఇంకా అరుదని ఇలా జరుగుతుం దని, దీంతో తల్లీబిడ్డలకు ప్రమాదమేమీ ఉండదని తెలిపారు. ‘‘పాపను బయటకు తీస్తున్నప్పుడు డాక్టర్లు నాకు స్క్రీన్‌ పై చూపించారు. వామ్మో… చెప్పలేనంత ఎమోషన్‌ కు గురయ్యా’’ అని 34 ఏళ్ల వాలస్కో అన్నారు. జానా బ్రాసిల్‌‌‌‌ అప్పుడే పుట్టిన ఈ బుజ్జిగాడి ఫొటోలు క్లిక్‌ మనిపించాడు.

Latest Updates