హోటల్లో కలుషిత ఆహారం తిన్న కుటుంబం.. చిన్నారి మృతి

కలుషిత ఆహారం రెండేళ్ల చిన్నారి ప్రాణం తీసింది. కాస్త ఖరీదైన హోటల్ ఫుడ్ బాగుంటదని వెళ్తే ఆ కుటుంబాన్ని మొత్తం ఆస్పత్రిపాలు చేసింది.ఆ  కుటుంబంలో విషాదం నింపింది. ఈ ఘటన  బేగంపేటలోని ఓ హోటల్ లో జరిగింది.

ఖమ్మం జిల్లాకు చెందిన రవి నారాయణ శ్రీవిద్య దంపతులకు ఇద్దరు పిల్లలు.బెంగళూరులోని ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో పనిచేస్తున్నారు. అమెరికా వెళ్లేందుకు ఇద్దరి పిల్లలకు వీసా కోసం ఈ నెల 10 న బేగంపేటలోని యూఎస్ కాన్సులేట్ కు వచ్చారు.  ఓ హోటల్ లో బస చేశారు.అదే రోజు రాత్రి ఆహారం తిన్న నలుగురు అస్వస్థకు గురయ్యారు. వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు అక్కడున్నవారు. అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రెండేళ్ల కుమారుడు మృతి చెందాడు. మరో ఏడేళ్ల కుమారుడు తల్లిదండ్రులిద్దరూ కిమ్స్  ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కలుషిత ఆహారం తినడంతోనే అస్వస్థకు గురైనట్లు డాక్టర్లు చెప్పారు.

హోటల్ లో కలుషిత ఆహారం తినడం వల్లే ఫుడ్ ఫాయిజన్ అయి తమ కొడుకు మరణించాడని చిన్నారి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు ..అయితే పోలీసులు ఈ కేసును అనుమానాస్పద కేసుగా నమోదు చేసుకుని దర్యాప్తు  చేస్తున్నారు. హోటల్లో ఉన్న రూమ్ లో ఏవైనా విషపదార్థాలు ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేయించారు. ప్రస్తుతం బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు.

see more news

ఆప్ ఎమ్మెల్యే కాన్వాయ్ పై కాల్పులు..ఒకరు మృతి

మింత్రాతో జతకట్టిన విజయ్ ‘రౌడీ‘ ఫ్యాషన్ బ్రాండ్

టీ20లకు గుడ్ బై చెప్పనున్న స్టార్ క్రికెటర్

Latest Updates