తండ్రి కారుకిందపడి చిన్నారి మృతి

బాలాపూర్‌: పొరపాటున తండ్రి కారు కిందేపడి ఓ చిన్నారి మృతిచెందిన సంఘటన హైదరాబాద్ లో గురువారం జరిగింది. మీర్‌పేట నందిహిల్స్‌ కాలనీలో ఉండే కృష్ణ, జ్యోతిలకు ఇద్దరు సంతానం. కృష్ణ కారు డ్రైవర్‌ గా పనిచేస్తున్నాడు. గురువారం ఉదయం డ్యూటీకి వెళ్లడానికి రెడీ అయ్యాడు. అప్పటి వరకు కొడుకు గౌతమ్‌ (20 నెలలు) ఇంట్లోనే తల్లిదండ్రుల ముందు ఆడుకున్నాడు. తండ్రి బయటకు వెళ్తున్నట్లు గమనించాడో.. ఏమో.. బయటకు వచ్చి కారు వెనుకే నిల్చున్నాడు. ఆ విషయాన్ని గుర్తించని కృష్ణ కారును వెనక్కి పోనిచ్చాడు. కొడుకు నలిగిపోయిన విషయాన్ని గమనించలేదు. డ్యూటీకి వెళ్లిపోయాడు. కొడుకు కనిపించకపోవడంతో.. జ్యోతి బయటకు వచ్చి చూడగా చిన్నారి గాయాలతో పడి ఉన్నాడు. ఆందోళన చెందిన ఆమె.. వెంటనే భర్తకు ఫోన్‌ చేసి చెప్పింది. కంగారుగా వచ్చిన కృష్ణ కొడుకును ఉస్మానియా హస్పిటల్ కి తీసుకువెళ్లినా లాభం లేకపోయింది. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. అప్పటివరకు నవ్వుతూ కనిపిచిన కొడుకు చనిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. తన కొడుకును తానే చప్పుకున్నానంటూ కృష్ణ విలపించాడు.

Latest Updates