
వేగంగా వెళుతున్న కారులోంచి ఓ చిన్నారి కిందపడిపోతే.. అప్పటికే ఆ రోడ్లో ట్రాఫిక్ ఉండి ఉంటే.. ఆ ఆలోచనే చాలా భయంకరంగా ఉంటుంది కదా. కానీ, కేరళలోని కొత్తక్కల్లో అలాంటి గగుర్పొడిచే ఘటన జరిగింది. డిసెంబర్లో జరిగిన ఈ ఘటన తాలూకు వీడియోను పంకజ్ నైన్ అనే ఐపీఎస్ ఆఫీసర్ షేర్ చేశారు. ఓ మూలమలుపు వద్ద వేగంగా వెళుతున్న కారు డోరు ఉన్నట్టుండి తెరుచుకుంది. వెంటనే ఓ చిన్నారి అందులో నుంచి జారి పడిపోయాడు. వెనక, ముందు నుంచి వస్తున్న వాహనాలు వెంటనే బ్రేక్ కొట్టడంతో ఆ చిన్నారి క్షేమంగా బయటపడ్డాడు. అదృష్టం బాగుండి చిన్న దెబ్బ కూడా తగల్లేదు. ఈ ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకొనైనా డోర్లకు చైల్డ్ లాక్ వేయండి అంటూ పంకజ్ సూచించారు.