నాలుగేళ్ల బాలికపై ఆయాల లైంగిక దాడి

child harassment in Baby care Center in Hyderabad

హైదరాబాద్, వెలుగు: బేబీ కేర్ సెంటర్ లో నాలుగేళ్ల బాలికపై ఆయాలు లైంగిక దాడులకు పాల్పడిన ఘటన హైదరాబాద్ లోని మాదాపూర్ పోలీసు స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.చెన్నైకు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు మాదాపూర్లోని పత్రికానగర్ లో నివాసం ఉంటున్నారు. నాలుగేళ్ల కూతురిని మాదాపూర్ లోని బేబీకేర్ సెంటర్ లోజాయిన్ చేశారు. అక్కడ ఆయాలుగా పని చేస్తున్న పర్వీన్ , నర్సమ్మలు బాలికకు స్నానం చేయించేటప్పుడు సున్నితమైన అవయవాలపై కర్ర ముక్కతో దాడి చేశారు. దీంతో బాలికకు తీవ్ర రక్తస్రావంకావడంతో వెంటనే కొండాపూర్ లోని ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఈ ఘటనపై మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.నిందితులు పర్వీన్ , నర్సమ్మలను లెస్బియన్లుగా గుర్తిం చిన పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. వెంటనే బేబీ కేర్ సెంటర్ ను మూసివేసి నిర్వాహకులు, ఆయాలను అరెస్టు​ చేయాలని బాలలహక్కుల సంఘం గౌరవ అధ్యక్షుడు అచ్యుతరావు డిమాండ్​ చేశారు.

Latest Updates