షాపింగ్​మాల్​ నుంచి చిన్నారి కిడ్నాప్

షాపింగ్​మాల్​ నుంచి చిన్నారి కిడ్నాప్

నిజామాబాద్ క్రైమ్‌, వెలుగు: నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని షాపింగ్‌ మాల్​దగ్గర ఓ చిన్నారి కిడ్నాప్​కు గురైంది. జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలానికి చెందిన నూరిన్‌ సుల్తానా తన భర్త, కుటుంబసభ్యులతో కలిసి షాపింగ్‌ కోసం నిజామాబాద్‌ పట్టణంలోని షాపింగ్‌ మాల్​కు వచ్చారు. షాపింగ్‌ పూర్తయ్యాక కౌంటర్‌ ‌వద్ద  బిల్లు కట్టేందుకు నిలబడ్డారు. అదే సమయంలో వారి పాప(3) చేతిలో బ్యాగు పట్టుకుని బయటకు వెళ్లింది. ఇంతలో గుర్తు తెలియని ఓ మహిళ పాపను ఎత్తుకొని ఆటో రిక్షాలో  పారిపోయినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. పాప వద్ద  బ్యాగ్‌ ఉండడంతో అందులో డబ్బులు ఉన్నాయని ఎత్తుకెళ్లారా లేక వారికి సంబంధించిన వ్యక్తులు ఎవరైనా పాపను తీసుకెళ్లారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.