బాల కార్మికుల రెస్క్యూ: ముగ్గురు నిందితుల అరెస్ట్

హైదరాబాద్‌‌, వెలుగు: బాల కార్మికులను నిర్బంధించి పని చేయిస్తున్న ఇద్దరు యజమానులను రాచకొండ యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్‌ మంగళవారం అరెస్ట్ చేసింది. ప్లాస్టర్ ‌‌‌ఆఫ్పారిస్‌‌ కంపెనీల్లో పనిచేస్తున్న11మందిపిల్లలను రెస్క్యూ చేసింది. బచ్పన్‌‌ బచావో ఆందోళన్ , స్పందన ఎన్ఓతోజీ కలిసి జరిపిన జాయింట్ ‌ఆపరేషన్‌‌ వివరాలను సీపీ మహేశ్ ‌‌భగవత్ ‌వెల్లడించారు.
ఇతర రాష్ట్రాల నుంచి…
ఉత్తర్‌‌‌‌ప్రదేశ్‌‌ రాయ్ బ‌రేలీ జిల్లా రిష్తాకు చెందిన రామ్‌‌లాల్‌‌, పంకజ్ ‌‌కుమార్‌‌‌‌ చైతన్యపురిలో నివాసం ఉంటున్నారు. హయత్‌నగర్‌‌‌‌ మండలం పసుమాములలో మహేశ్, పెద్ద అంబర్‌‌‌‌పేట్‌‌కి చెందిన ఇటుకల జగన్‌‌మోహన్‌‌ రెడ్డి ప్లాస్టర్‌‌‌‌ ఆఫ్ పారిస్‌‌ కంపెనీలు నడుపుతున్నాడు. అందులో పని చేసేందుకు యూపీ, బిహార్,చత్తీస్ గ‌డ్ నుంచి 8 నుంచి 18 ఏండ్లలోపు పిల్లలను తీసుకొచ్చి, ఉదయం 8 నుంచి రాత్రి 10గంటల వరకు పని చేయిస్తున్నారు. కంపెనీ షెడ్ల నుంచి బయటకు రాకుండా నిర్బంధించారు. సమాచారం అందుకున్న రాచకొండ యాంటీ హ్యూమన్‌‌ ట్రాఫికింగ్ యూనిట్ తో పాటు చైల్డ్‌‌ హెల్ప్‌‌లైన్‌‌, హయత్‌నగర్‌‌‌‌ పోలీసులు సోమవారం జాయింట్‌ ఆపరేషన్‌‌ నిర్వహించారు. రామ్‌‌లాల్‌‌, పంకజ్‌‌కుమార్‌‌‌‌, జగన్‌‌మోహ‌న్ ని అరెస్ట్‌‌ చేశారు. 11 మంది బాలలను రెస్క్యూ హోమ్‌‌కి తరలించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం

Latest Updates