ఇంటర్​లో ఫెయిలైనోళ్లను పాస్​ చేయండి

హైదరాబాద్, వెలుగు: మార్చిలో జరిగిన ఇంటర్మీడియేట్ ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయిన విద్యార్థులందరినీ పాస్ చేయాలని తెలంగాణ ప్రైవేటు జూనియర్ కాలేజీల మేనేజ్ మెంట్ల అసోసియేషన్ (టీఈజేఎంఏ) ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు మంగళవారం ఎడ్యుకేషన్ మినిస్టర్ సబితారెడ్డిని (టీఈజేఎంఏ) రాష్ర్ట అధ్యక్షడు గౌరీ సతీశ్​ నేతృత్వంలోని బృందం కలిసి వినతిపత్రం అందించింది. ఈ సందర్భంగా గౌరీ సతీశ్ మాట్లాడుతూ కరోనా కేసులు పెరుగుతుండటంతో ఇంటర్ అడ్వాన్డ్స్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించడం సాధ్యం కాదని చెప్పారు. ఈ సమయంలో ఎగ్జామ్స్ నిర్వహించాలనుకుంటే స్టూడెంట్స్, లెక్చరర్స్ ఆరోగ్యాలను రిస్క్ లో పెట్టటమేనన్నారు. స్టూడెంట్స్ భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకొని మార్చిలో ఫెయిల్ అయిన వారందరినీ అకడమిక్ ఇయర్ నష్టపోకుండా పాస్ చేయాలని కోరారు.

ప్రజల్లో ఉన్నందుకే మా ఎమ్మెల్యేలకు కరోనా

Latest Updates