భార్య, పిల్లల్ని చంపి, వాట్సప్ లో వీడియో

అల్లారుముద్దుగా చూసుకోవాల్సిన పిల్లల్ని దారణంగా చంపాడు ఓ తండ్రి. తన భార్యతో పాటు ముగ్గురు పిల్లల్ని హత్య చేశాడు. ఈ తర్వాత హత్య చేసిన వీడియోను వాట్సాప్ లో పోస్ట్ చేశాడు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్‌ లో జరిగింది. ఘజియాబాద్‌లోని ఇందిరాపురానికి చెందిన సుమిత్ కుమార్ అనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగికి అన్షూబాల అనే మహిళతో కొన్నేళ్ళ క్రితం వివాహం కాగా, వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. అన్షూబాల మాత్రం సైకాలజీ టీచర్‌ గా పని చేస్తుంది. కుమార్‌ కొద్ది నెలల క్రితం ఉద్యోగం మానేసి ఇంటి దగ్గర ఖాళీగా ఉంటున్నాడు.

సాఫ్ట్ వేర్ గా ఉన్నప్పుడు బాగా జల్సాలను అలవాడు పడ్డ సుమిత్.. జాబ్ పోయాక డబ్బులులేకపోవడంతో అప్పుల పాలయ్యాడు. దీంతో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతూ వచ్చాయి. ఈ క్రమంలో శనివారం రాత్రి భార్యతో గొడవపడ్డ కుమార్‌.. అదే రోజు రాత్రి భార్య, ముగ్గురు పిల్లలను కిరాతంగా హత్య చేశాడు. నిద్రలో ఉన్న భార్య, పిల్లల్ని హత్య చేసి, వీడియో తీసి, ఫ్యామిలీ వాట్సాప్‌ గ్రూప్‌ లో పోస్ట్‌ చేశాడు. ఈ వీడియోను చూసిన అన్షూ అన్నయ్య పంకజ్‌ సింగ్‌ పోలీసులకు సమాచారం ఇచ్చి ఇంటికి వెళ్లాడు. తలుపులు తెరచి చూడగా అన్షూ, ముగ్గురు పిల్లలు విగతజీవులుగా పడిఉన్నారు. పోలీసులు నాలుగు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.

ఉద్యోగం పోవడంతోపాటు ఆర్థిక సమస్యల్లో చిక్కుకున్న కుమార్.. మానసిక రుగ్మతతో బాధపడుతున్నట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. దీంతో భార్యతో గొడవపడి హత్యలకు పాల్పడినట్లు తెలుస్తోంది. పంకజ్‌ సింగ్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు కుమర్‌ ని అరెస్ట్‌ చేశారు పోలీసులు.

Latest Updates