తొలిసారి ర్యాప్ కు గ్రామీ : గంబీనో ‘దిస్ ఈజ్ అమెరికా’ రికార్డ్

 యూ ట్యూబ్ సంచలనం ‘దిస్ ఈజ్ అమెరికా’ పాట సరికొత్త హిస్టరీ క్రియేట్ చేసింది. మ్యూజిక్ రంగంలో ఇచ్చే ప్రతిష్టాత్మక గ్రామీ అవార్డును ఈ పాట గెల్చుకుంది. ఓ ర్యాప్ సాంగ్… గ్రామీ అవార్డుకు ఎంపిక కావడం ఇదే మొట్టమొదటిసారి. దిస్ ఈజ్ అమెరికా అంటూ…. అమెరికాలో పెరిగిపోయిన గన్ కల్చర్ ను తన పాటలో చూపించాడు చైల్డిష్ గంబీనో. ఐతే.. ఈ అవార్డుల వేడుకకు అతడు హాజరు కాలేదు. గ్రామీ వేదికపై పెర్ఫామ్ చేయాలంటూ వచ్చిన ఇన్విటేషన్ ను కూడా అతడు నిరాకరించాడు. తనకు వచ్చిన అవార్డ్ ను కూడా అందుకోలేదు.

అమెరికన్ యాక్టర్, కమెడియన్, రైటర్,  ప్రొడ్యూసర్, డైరెక్టర్, ర్యాపర్, సింగర్, డీజే అయిన డొనాల్డ్ మెక్ కిన్ లే గ్లోవర్ జూనియర్ … ర్యాప్ ప్రపంచంలో చైల్డిష్ గంబీనోగా ఫేమస్. అది అతడి స్టేజ్ నేమ్. 2018లో వచ్చిన దిస్ ఈజ్ అమెరికా యూట్యూబ్ లో బాగా పాపులర్ అయ్యింది. షాలో, ద మిడిల్ లాంటి బిగ్ హిట్స్ ను కూడా దిస్ ఈజ్ అమెరికా బీట్ చేసింది.

 

 

Latest Updates