అభంశుభం తెలియని పిల్లలు కేన్సర్ బారినపడడం బాధాకరం

ఇంటర్నేషనల్ చైల్డ్ హుడ్ క్యాన్సర్ డే సందర్భంగా హైదరాబాద్ బసవతారకం హాస్పిటల్ లో క్యాన్సర్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. హిందూపురం ఎమ్మెల్యే, సినీ హీరో బాలకృష్ణ, హీరోయిన్ రష్మిక పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిల్డ్రన్ క్యాన్సర్ ఫండ్‌ను ప్రారంభించారు. దీనికి విరాళంగా బసవతారకం డాక్టర్లు ఒక్క రోజు శాలరీని అందిస్తున్నట్లు ప్రకటించారు.
క్యాన్సర్ కోసం చాలా డబ్బు ఖర్చు అవుతోందని, అందుకే క్యాన్సర్ ఫండ్ ప్రారంభించినట్లు బాలకృష్ణ చెప్పారు. రకరకాల కారణాలతో ఏటా 50 వేల మందికిపైగా చిన్నారులు క్యాన్సర్ బారినపడుతున్నారని అన్నారు. అభంశుభం తెలియని పిల్లలు క్యాన్సర్ బారిన పడడం బాధాకరమని, మన దేశానికి యువతే బలమని, ఈ చిన్నారులను మనం కాపాడుకోవాలని చెప్పారాయన. పేదలకు తక్కువ ఖర్చుతో వైద్యం అందాలన్న తన తల్లి బసవతారకం లక్ష్యాన్ని కొనసాగిస్తున్నామన్నారు. క్యాన్సర్ భూతం నుంచి చిన్నారులను కాపాడేందుకు ఎంతోమంది దాతలు ఫండ్స్ ఇస్తున్నారని, వారందరికీ కృతజ్ఞతలు చెబుతున్నానని అన్నారు బాలకృష్ణ.

 

Latest Updates