ఢిల్లీ పిల్లలు రోజూ 10 సిగరెట్లు కాల్చినట్టే!

  • నెల రోజుల్లో విపరీతంగా పెరిగిన పొల్యూషన్
  • ‘వెరీ పూర్’ స్థాయికి పడిపోయిన ఎయిర్ క్వాలిటీ
  • 340 సిగరెట్లంత ఎఫెక్ట్ ఉంటదంటున్న నిపుణులు

‘పొగ తాగడం ఆరోగ్యానికి హానికరం’… కానీ ఢిల్లీ పిల్లలు రోజూ10 సిగరెట్ల పొగ పీల్చేస్తు న్నరట! అయ్యో.. చిన్న వయసులోనే స్మోకింగ్ కు అలవాటు పడిపోతున్నారా ? అని సర్ ప్రైజ్ కావద్దు. వాళ్లు పీలుస్తున్నది సిగరెట్ పొగ కాదు.. పొల్యూషన్ పొగ! ఢిల్లీలో విషపూరితం అయిపోయిన గాలి! ఆ పొగ, గాలి ఎఫెక్ట్ నెలరోజుల్లో దాదాపు340 సిగరెట్లు తాగినంత తీవ్రంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. గత నెల 20వ తేదీ నుం చి ఈ నెల 21 మధ్య ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ తీవ్రస్థాయికి చేరింది. దీంతో ఢిల్లీలోని గాలిలో మనుషుల ఊపిరితిత్తులకు హాని చేసే పీఎం2.5 కాలుష్య కారకాలు, వాటి ఎఫెక్ట్ ను అంచనా వేశారు. పీఎం 2.5 సైజ్ కణాలు ఒక క్యూబిక్ మీటర్ గాలిలో 22 మైక్రోగ్రాములు ఉంటే.. ఒక రోజుకు ఒక సిగరెట్ తాగినట్లు లెక్క అని అప్పట్లో కాలిఫోర్నియాలోని బర్కిలీ ఎర్త్ రీసెర్చర్లు అంచనా వేశారు. అక్టోబర్ 20, నవంబర్ 21 మధ్య ఢిల్లీలోని అన్ని వెదర్ మానిటరిం గ్ కేం ద్రాల్లో పీఎం 2.5 కణాలు సగటున ఒక క్యూబిక్ మీటర్ గాలిలో 227 మైక్రోగ్రాములు ఉన్నట్లు తేలిం ది. అంటే.. ఈ గాలిని పీల్చితే..రోజూ 10 సిగరెట్లు తాగినంత ఎఫెక్ట్ పడుతుం దని నిపుణులు అంచనా వేశారు. నవంబర్ 3న గాలి మరీ విషపూరితం అయిం దని, ఆ రోజంతా ఢిల్లీ గాలి పీల్చినోళ్లు.. 26 సిగరెట్లు తాగినట్లేనని గుర్తించారు. మొత్తంగా ఎయిర్ పొల్యూషన్ వల్ల ఢిల్లీలో ఉండేటోళ్ల ఆయుష్షు 17 ఏండ్లు తగ్గుతుందట. ఢిల్లీ, ఎన్ సీఆర్ ప్రాంతంలో ఎయిర్ పొల్యూషన్ వల్ల శ్వాస సంబంధమైన సమస్యలే కాకుం డా, చర్మ రోగాల ముప్పు కూడా పెరుగుతోం దని ఎయిమ్స్​  డాక్టర్లు చెబుతున్నారు. ప్రస్తుతం పొల్యూషన్ వల్ల ఢిల్లీలో చర్మ సమస్యలు 30 శాతం పెరిగాయని వివరించారు.

ఢిల్లీ ఎయిర్ క్వాలిటీ ‘వెరీ పూర్’..

ఢిల్లీ, ఎన్సీఆర్ లలో ఎయిర్ క్వాలిటీ ఆందోళనకర స్థాయికి ప డిపోయిం ది. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు ఢిల్లీలో ఏక్యూఐ360 పాయింట్లు నమోదైంది. సిటీలో ఏక్యూఐ ‘వెరీ పూర్’ కేటగిరీలో ఉందని అధికారులు చెప్పారు. రాబోయే 48 గంటల్లో ఎయిర్ క్వాలిటీ ‘వెరీ పూర్’ నుం చి ‘పూర్’ స్థాయికి మెరుగుపడుతుం దని తెలిపారు. కానీ 25వ తేదీ నుం చి మళ్లీ ఎయిర్ క్వాలిటీ పడిపోయే అవకాశాలున్నాయన్నారు. అయితే, బీజిం గ్ ఎయిర్ క్వాలిటీ ఇంప్రూవ్ అయ్యేం దుకు 15 ఏండ్లు పట్టిందని, కానీ ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ పెంచేం దుకు అంతకంటే తక్కువ సమయమే పడుతుం దని శుక్రవారం పర్యా వరణ శాఖ మంత్రి  ప్రకాశ్ జవదేకర్ అన్నారు. ఈ సమస్యను పరిష్కరించు కునేం దుకు ఒక మాస్ మూమెంట్ రావాల్సి న అవసరం ఉందన్నారు.

Children in Delhi smoke 10 cigarettes a day just by breathing

Latest Updates