కనిపించకుండా పోయిన కవలలు శవమై తేలారు

బోపాల్‌: కనిపించకుండా పోయిన కవల పిల్లలు శవమై తేలారు. ఈ సంఘటన మధ్యప్రదేశ్ లో జరిగింది. ఫిబ్రవరి 12న పిల్లలు చదువుకుంటున్న స్కూల్ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తులు వారిని కిడ్నాప్ చేశారు. కవలల కోసం తీవ్ర గాలింపు చేపట్టిన ఆ రాష్ట్ర పోలీస్‌ బృందానికి ఉత్తరప్రదేశ్ లోని బండా ప్రాంతంలో యమున నదీ తీరంలో విగతజీవులుగా కనిపించారు. ఐదేళ్ల శ్రేయాన్షు, ప్రియాన్షు అనే కవలలు మధ్యప్రదేశ్‌ లోని ఓ ప్రముఖ వ్యాపారవేత్తకు చెందిన పిల్లలు. చిత్రకూట్‌ సమీపంలో వారు చదువుకుంటున్న స్కూల్‌ దగ్గర యూపీకి చెందిన కిడ్నాపర్లు గన్‌ తో బెదిరించి వారిని కిడ్నాప్‌ చేశారు. రూ.50 లక్షలు ఇస్తే వారిని వదిలేస్తామని బెదిరించారు.

డబ్బులు చెల్లించినప్పటికీ పిల్లల్ని హతమార్చి నదిలో వదిలేశారు. ఈ ఘటన యూపీ, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. ఘటనకు సంబందించి ఆరుగురిని అరెస్ట్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు.

Latest Updates