కరోనాపై చిన్నారుల సమరం

కరోనా మహమ్మారి పట్ల అప్రమత్తం చేసేందుకు చిన్నారులు మేము సైతం అంటున్నారు. ఆర్మీ దుస్తులు ధరించి ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్ర‌జ‌ల‌ను ఆలోచింప‌జేస్తున్న‌ ఈ ఆసక్తికరమైన సంఘటన క‌రీంన‌గ‌ర్ జిల్లాలో జ‌రిగింది.

హుజురాబాద్ మండలం చెల్పూరు గ్రామానికి చెందిన చిన్నారులు క‌రోనా జాగ్ర‌త్త‌ల‌పై ఆర్మీ దుస్తులు ధరించి ప్రచారం నిర్వహిస్తున్నారు. అప్రమత్తంగా ఉండి కరోనా మహమ్మారిపై యుద్ధం చేసి విజయం సాధించాలని కోరుతున్నారు. చిన్నారులు చిన్ని చిన్ని మాటలతో ప్రచారం నిర్వహించడంతో చూసిన‌వారంతా మెచ్చుకుంటున్నారు. చేతులు శుభ్రం చేసుకోవాల్సిన విధానం మాస్కు ధరించాల్సిన ఆవశ్యకతపై చిన్నారులు వివరించిన విధానం వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయండంతో వైర‌ల్ అయ్యింది. చిన్నారుల‌ను చూసైనా ప్ర‌తి ఒక్క‌రూ క‌రోనా జాగ్ర‌త్త‌లు పాటించాలంటున్నారు నెటిజ‌న్లు.

Latest Updates