వానల కోసం వరుణ జపం చేస్తున్న పూజారులు

chilkur-balaji-temple-priests-doing-varuna-japam

వర్షాకాలం మొదలై.. చాలా రోజులు కావోస్తున్న ఇంతవరకు నగరంలో వానలు పడకపోవడంతో చిలుకూరు బాలాజీ దేవాలయ పూజారులు వరుణ జపం చేశారు. రంగారెడ్డి జిల్లా మొయినబాద్ మండలం లోని గండిపేట జలాశయంలో దిగి వరుణ దేవుడి కోసం పూజలు చేశారు. నీటి కోసం నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వరుణుడి కరుణ కోసం ఈ జపం చేస్తున్నట్లుగా తెలిపారు.

వరుణ జపం నిర్వహించిన చిలుకూరు బాలాజీ దేవాలయం ప్రధాన అర్చకులు రంగరాజన్ పంతులు మాట్లాడుతూ.. వర్షాకాలం వచ్చి 45 రోజులు గడుస్తున్నా సరిగ్గా వర్షాలు లేక దేశంలో మరియు తెలంగాణ రాష్ట్రం లో రైతులు ఆందోళన చెందుతున్నారన్నారు. రాష్ట్రంలో కరువు ఏర్పడే పరిస్థితి వచ్చిందని అన్నారు,దాదాపు 45% లోటు వర్షపాతం నమోదైంది అని ఆవేదన వ్యక్తంచేశారు.

వరుణ జపానికి ముందు సంకీర్తనా యాగం కూడా నిర్వహించామని రంగరాజన్ అన్నారు. ఈరోజు సుదర్శన భగవాన్ పుట్టిన రోజు కూడా అందుకే ఈరోజు వరుణ జపం చేయడం చాలా గర్వంగా ఉందని ఆయన అన్నారు. ఆ వేంకటేశ్వరుని ఆశీస్సులతో వర్షాలు కురవాలని కోరుకున్నట్లు ఆయనతో పాటు మిగతా అర్చకులు తెలిపారు.

Latest Updates