అమ్మాయిని కాపాడాడు.. మొదటి జటాయువు ఇతడే..!

హైదరాబాద్ : ఆడపిల్లల రక్షణ కోసం కొన్ని కోట్ల మంది జటాయువులు కదిలి రావాల్సిన అవసరం ఉందన్నారు చిలుకూరు ఆలయ అర్చకులు రంగరాజన్. చిలుకూరు బాలాజీ టెంపుల్ ఆధ్వర్యంలో జటాయువు జన్మదినం సందర్భంగా ఆడవాళ్లకు రక్షణగా జటాయు సైన్యాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు రంగరాజన్. సమాజంలో ఆడవాళ్లపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టేందుకు జటాయు సైన్యం పెరగాలన్నారు. మొట్టమొదటి జటాయువుగా కార్వాన్ కి చెందిన నదీమ్ ను సెలక్ట్ చేసిన రంగరాజన్..అతడికి సన్మానం చేశారు.

నెల రోజుల కింద గుర్తు తెలియని వ్యక్తులు 10సంవత్సరాల అమ్మాయిని స్కూటీ పై ఎక్కించుకుని కాడ్నాప్ చేయబోయారు. స్కూటీపై ఉన్న అమ్మాయి అరుస్తూ ఉంటే.. అది చూసిన నదీమ్ ..స్కూటీని అడ్డుకుని కిడ్నాపర్ ను పోలీసులకు అప్పగించాడు. అందుకే మొట్టమొదటి జటాయువుగా నదీమ్ ను ఎన్నుకోవడం జరిగిందన్నారు రంగరాజన్. ఇలాంటి మంచి పనులు చేయడానికి ప్రతి ఒక్కరూ వస్తే అత్యాచారాలు తగ్గించవచ్చన్న రంగరాజన్..మహిళలు, బాలికలు, అమ్మాయిలను రక్షణ ఉంటుందన్నారు.

Latest Updates