కరోనాకి మూడిందే..3వేల ఏళ్ల నాటి వైద్యాన్ని అందిస్తున్న చైనా

చైనాలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. శనివారం నాటికి మొత్తం వైరస్ దెబ్బకు 1523మంది చనిపోగా, 66,500మందికి ఈ వ్యాధి లక్షణాలు ఉన్నట్లు చైనా ప్రభుత్వం ప్రకటించింది.

అయితే రోజురోజుకి ఈ వైరస్ ప్రభావం ఎక్కువ అవ్వడంతో..చైనా వైద్యశాఖ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వైరస్ ను సమూలంగా నాశనం చేసేందుకు ఆదేశానికి చెందిన 3వేల ఏళ్లనాటి మందులు, వైద్య విధానాల్ని అవలంభిస్తుంది. వుహాన్ సిటీ సహా హ్యుబే ప్రావిన్స్‌లోని కొన్ని ఆసుపత్రుల్లో ఈ తరహా వైద్య విధానాన్ని ప్రారంభించినట్లు చైనా వైద్య, ఆరోగ్యమంత్రిత్వ శాఖ అధికారి, హ్యుబే ప్రావిన్స్ కొత్త హెల్త్ కమిషనర్ ఛైర్మన్ వాంగ్ హెషెంగ్ ప్రకటించారు.  ప్రాచీన వైద్య విధానాలను అనుసరిస్తూ చికిత్స అందించే  2200 మంది వైద్యుల్ని  హ్యుబే ప్రావిన్స్‌కు తరలించినట్లు చెప్పారు. ప్రాచీన, ఆధునిక పద్దతుల్లో చికిత్స అందించడం ద్వారా కొంత సానుకూల వాతావరణం కనిపిస్తోందని చెప్పారు.

తమ దేశంలోని అన్ని ప్రావిన్స్‌లల్లోనూ కరోనా వైరస్ విస్తరించిందని వాంగ్ హెషెంగ్ స్పష్టం చేశారు. ప్రాచీన వైద్య విధానంతో  వైరస్‌ వ్యాప్తిని అడ్డుకట్ట వేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని పేర్కొన్నారు.

Latest Updates