చైనా మూడో శక్తి రెడీ అవుతోంది

చైనా మూడో ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ‘టైప్‌‌‌‌002’ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. నౌకకు సంబంధించిన ఫొటోలను అమెరికాకు చెందిన థింక్ ట్యాంక్ సెంటర్ ఫర్ స్ట్రాటజిక్, ఇంటర్నేషనల్ స్టడీస్(సీఎస్ఐఎస్) సోమవారం బయటపెట్టింది. షాంఘైలోని జియాంగ్నాన్ షిప్ యార్డులో నౌక ఉందని చెప్పింది. అయితే కొత్త ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్‌‌‌‌పై చైనా ఇప్పటివరకూ ఎలాంటి అధికార ప్రకటన చేయలేదు. ఇప్పుడున్న నౌకల కన్నా దీనిలో అత్యాధునిక టెక్నాలజీని వాడుతున్నట్లు రిపోర్టులు చెబుతున్నాయి. దీంతో ప్రపంచదేశాల దృష్టంతా చైనా విమాన వాహక నౌక ‘టైప్002’ మీదే ఉంది.

అమెరికా దగ్గర ఉన్న లక్ష టన్నుల ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లకు దీటుగా ఇది ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. రెండు ఫుట్ బాల్ మైదానాల సైజులో నౌక చుట్టుపక్కల భారీ షెడ్లు ఉన్నట్లు గుర్తించారు. ఫైటర్ జెట్లు వేగంగా ఎగిరేందుకు, తక్కువ సమయంలో ఆపరేషన్స్ నిర్వహణకు ఈ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అనుకూలంగా ఉంటుందని చెబుతున్నారు. టైప్ 002 న్యూక్లియర్ పవర్ నౌకా కాదా అన్న విషయంపై క్లారిటీ లేదు. దీని నిర్మాణం పూర్తయితే ఆసియాలో అత్యాధునిక ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ కలిగిన దేశంగా చైనా అవతరిస్తుంది. ఇండియా, జపాన్ వద్ద కూడా ఇంత శక్తిమంతమైన క్యారియర్లు లేవు. చైనా తొలి ఎయర్ క్రాఫ్ట్ క్యారియర్ లియనింగ్ ను 1998లో, రెండో క్యారియర్ ను 2017లో తెచ్చారు. వీటిలో ఒకేసారి 25 ఫైటర్ల కంటే ఎక్కువగా తీసుకెళ్లడం కుదరదు.

Latest Updates